Sunday, 6 August 2017

Happy Friendship Day

ప్రతి అడుగులో ఉత్తేజం                         
ప్రతి మాటలో ఉత్సాహం                              
ఈ స్నేహం ఏంతో అమూల్యం                                        ఎల్లపుడు నిలవాలి స్నేహ బంధం             
కావాలి ప్రతి రోజు స్నేహితుల దినోత్సవం

Sunday, 16 July 2017

Drugs పైన

గ"మ్మత్తు"గా ఉంది నాకేమి తెలిదంటే            
నమ్మాలా సినీ జగత్తు మాయలో లేదంటే  
జంకుతున్నారు తప్పును ఒప్పుకోమంటే
భయమా కారాగారానికి వెళ్లాలంటే

Tuesday, 11 July 2017

కాశ్మీర్ అమర్నాథ్ యాత్ర అంశం

రక్తమోడుతున్న మంచు కాశ్మీరం
మంచు లింగం దర్శనానికి వెళ్తూ ఘోరం
ఎప్పటికైనా తీవ్రవాదం నిర్వీర్యం
ఎన్నటికీ దేశప్రజలకు తగ్గదు ధైర్యం
వీర సైనికుల పోరాటం అజరామరం
బస్సు డ్రైవరు సాహసం అభినందనీయం

Sunday, 18 June 2017

పితృ దినోత్సవ శుభాకాంక్షలు

బుడి బుడి అడుగులు వేయించావు                           
 మా అభ్యున్నతి కోరుకుంటావు              
  మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు                         నాన్న నీ అడుగుజాడల్లో సాగిపోతూ

Thursday, 8 June 2017

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

నలుమూలలు చేరిన నవ్యాంధ్ర కీర్తి             
అమరావతి తెచ్చెను విశ్వ ఖ్యాతి                 
ముందుకు దూసుకువెళ్తున్న ప్రగతి           
ప్రజలు విశ్వసించెను పురోగతి

Friday, 2 June 2017

తెలంగాణ అవతరణ దినోత్సవం

మూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం 
ముప్పై ఒక్క జిల్లాల అపూర్వ మణిహారం 
ప్రాణాలు త్యజించిన వారు ఎప్పుడు అమరం
పోరాట యోధుల శ్రమతో మన కల సాకారం

కాకతీయతో చెరువులకు నిండుదనం     
భగీరధతో ప్రతి ఇల్లు మంచినీళ్ల మయం      
హరితహారం నింపెను ఊరంతా పచ్చదనం 
జనహిత ముందుకు సాగెను ప్రగతి కోసం

Sunday, 14 May 2017

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

నవ మాసాలు మోసి ప్రాణం పోశావు
ఓనమాలు నేర్పించి తొలి గురువయ్యావు                       అల్లరి హద్దులు దాటినా భరించావు             
మాతృ ప్రేమను ఎన్నటికి మర్చిపోనివ్వవు
ఎన్ని కష్టాలు ఎదురైనా బయటపడనివ్వవు                   మేము వృద్ధిలోకి రావాలని తపనపడతావు