Tuesday 9 April 2024

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది

మమ్ముల్ని చేయకు ఎవరికి విరోధి

ప్రసాదించు సుఖ సంతోషాల పడి

ఇవ్వు ఆయు ఆరోగ్యాల సవ్వడి


Thursday 21 March 2024

నిద్ర

ఆనంద ఆనందమాయే వెన్నెలా

నిద్ర పుచ్చట్లేదు ఎందుకలా

చరవాణి చూడకుండా ఉండేలా

ఏదైనా మార్గం చూపిస్తేపోలా 

Monday 26 February 2024

ఏదో అలా

ఎందుకో ఈ తాపత్రయం 

రెప్పార్పట్లేదు నయనం

గుర్తుకొస్తుంది జ్ఞాపకం

తిరిగొస్తుందా ఆ క్షణం

Monday 22 January 2024

అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట

అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టంటా

ఈ ప్రతిష్టను కీర్తించెను దేశమంతా 

దేశమంతా రామరాజ్యం తిరిగి వచ్చేనంటా

ఊరంతా రాములోరు పండగంటా