Thursday, 28 September 2017

బతుకమ్మ పండుగ

బతుకమ్మ బతుకమ్మ
ఊరంతా సంబరమమ్మ
ఇంటింటా కొలిచే గౌరమ్మ
అందరినీ చల్లంగా చూడమ్మ

బతుకమ్మ బతుకమ్మ
తెలంగాణ పండగమ్మ
తంగేడు పూలతో అలంకరించామమ్మ
ఆటపాటలతో సందడి చేసినామమ్మ

Tuesday, 5 September 2017

Happy Teachers Day

విద్యలు నేర్పే గురువులు  
సన్మార్గము చూపే పెద్దలు
వెలకట్టలేనివి మీ బోధనలు
మరువలేనివి మీ సూక్తులు
మీ అందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు