అదిగో అమరావతి
వైభవం తెచ్చెను ఆకృతి
పులకించెను ప్రకృతి
ప్రత్యేకము ఈ అవని
ఆంధ్ర రాష్ట్ర రాజధాని
గర్వించెను భారతావని
అదిగో అమరావతి
వైభవం తెచ్చెను ఆకృతి
పులకించెను ప్రకృతి
ప్రత్యేకము ఈ అవని
ఆంధ్ర రాష్ట్ర రాజధాని
గర్వించెను భారతావని
సంవత్సరమైంది రద్దై పెద్ద నోటు
ఇంకా తగ్గని సామాన్యుడి ఎడ పాటు
నోట్ల రంగుతో సరితూగేను నువ్వేసే కోటు
ప్రశ్నర్ధకాము అయ్యెను నీకు వేసే ఓటు
పెద్ద నోట్ల రద్దు తెచ్చింది రూపు
డిజిటల్ వాల్లెట్లకి వచ్చింది ఊపు
పడ్డాయి వాటిపై ప్రజలందరి చూపు
కానీ చిన్న వ్యాపారులకు దొరకని లూపు
దీపావళితో సంతోష కేళి
నింపాలి ఆనంద హోలీ
వెలిగించాలి కాంతుల హేలి
విరజిమ్మాలి కనక వల్లి
బతుకమ్మ బతుకమ్మ
ఊరంతా సంబరమమ్మ
ఇంటింటా కొలిచే గౌరమ్మ
అందరినీ చల్లంగా చూడమ్మ
బతుకమ్మ బతుకమ్మ
తెలంగాణ పండగమ్మ
తంగేడు పూలతో అలంకరించామమ్మ
ఆటపాటలతో సందడి చేసినామమ్మ
విద్యలు నేర్పే గురువులు
సన్మార్గము చూపే పెద్దలు
వెలకట్టలేనివి మీ బోధనలు
మరువలేనివి మీ సూక్తులు
మీ అందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు
ప్రతి అడుగులో ఉత్తేజం
ప్రతి మాటలో ఉత్సాహం
ఈ స్నేహం ఏంతో అమూల్యం ఎల్లపుడు నిలవాలి స్నేహ బంధం
కావాలి ప్రతి రోజు స్నేహితుల దినోత్సవం
గ"మ్మత్తు"గా ఉంది నాకేమి తెలిదంటే
నమ్మాలా సినీ జగత్తు మాయలో లేదంటే
జంకుతున్నారు తప్పును ఒప్పుకోమంటే
భయమా కారాగారానికి వెళ్లాలంటే
రక్తమోడుతున్న మంచు కాశ్మీరం
మంచు లింగం దర్శనానికి వెళ్తూ ఘోరం
ఎప్పటికైనా తీవ్రవాదం నిర్వీర్యం
ఎన్నటికీ దేశప్రజలకు తగ్గదు ధైర్యం
వీర సైనికుల పోరాటం అజరామరం
బస్సు డ్రైవరు సాహసం అభినందనీయం
బుడి బుడి అడుగులు వేయించావు
మా అభ్యున్నతి కోరుకుంటావు
మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు నాన్న నీ అడుగుజాడల్లో సాగిపోతూ
నలుమూలలు చేరిన నవ్యాంధ్ర కీర్తి
అమరావతి తెచ్చెను విశ్వ ఖ్యాతి
ముందుకు దూసుకువెళ్తున్న ప్రగతి
ప్రజలు విశ్వసించెను పురోగతి
మూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం
ముప్పై ఒక్క జిల్లాల అపూర్వ మణిహారం
ప్రాణాలు త్యజించిన వారు ఎప్పుడు అమరం
పోరాట యోధుల శ్రమతో మన కల సాకారం
కాకతీయతో చెరువులకు నిండుదనం
భగీరధతో ప్రతి ఇల్లు మంచినీళ్ల మయం
హరితహారం నింపెను ఊరంతా పచ్చదనం
జనహిత ముందుకు సాగెను ప్రగతి కోసం
నవ మాసాలు మోసి ప్రాణం పోశావు
ఓనమాలు నేర్పించి తొలి గురువయ్యావు అల్లరి హద్దులు దాటినా భరించావు
మాతృ ప్రేమను ఎన్నటికి మర్చిపోనివ్వవు
ఎన్ని కష్టాలు ఎదురైనా బయటపడనివ్వవు మేము వృద్ధిలోకి రావాలని తపనపడతావు
ఆతృతగా వేచి చూస్తున్నా బాహుబలి మళ్ళీ ఎన్నో రికార్డులు తిరగరాయాలి
కట్టప్ప కోసం సినిమాకి తప్పక వెళ్ళాలి
సినిమాని అగ్రపథానా నిలిపారు రాజమౌళి
నారి చేస్తావు నిత్యం బాధ్యతలతో సవారి
ఎక్కడ ఉన్న నిర్వర్తిస్తావు కర్తవ్యం సరాసరి
ఇల్లైన హరివిల్లైన నీవు లేనిదే నడవదు మరి
నింగి నేల తలవంచక తప్పదు నీ శక్తి ముందు
తరాలు మారిన మరువవు సంప్రదాయమందు
నీ ఓర్పు సహనములకు ప్రణామాలు ముందు
తల్లి,చెల్లి,భార్య పేరు ఏదైనా నీకు వందనం
కృషి పట్టుదలతో విజయం నీ సొంతం చదువైనా,ఆటపాటలైన గెలవటం నీ పంతం
తీరు మారని ప్రై"వేటు" బస్సులు
ప్రజల ప్రాణాలకి లేదు విలువలు
ప్రమాదాలు ఎన్నైనా ఆగని చక్రాలు
భద్రత కన్నా డబ్బు మీదే ఆశలు
ఆకాశమంత ఎత్తులో టిక్కెట్టు ధరలు
రూల్స్ పాటించడానికి రావు చేతులు
శివా శివా పరమ శివ
నీతో నే మా విజయి భవ
లోకాన్ని పాలించేది నువ్వేనయ మమ్మల్ని రక్షించేది నీవేనయ
నీ ఆజ్ఞ కోసం వేెచుండాలయా మమ్ము చల్లంగా చూడాలయా
అన్ని రూపాల్లో నీవుంటావు ఎక్కడున్నా మా కరుణ కోరుకుంటావు
నీపై ప్రేమ ఉందని తెలపనా
నా మనసు దోచావని అరవనా
ప్రతి రోజు గుర్తొస్తావాని చెప్పినా ఎందుకు ఈరోజే కలవాలని తపనా
ఇదిగో విను వాలెంటైన్ ప్రేమను కురిపించే ఫౌంటైన్ నిన్ను చేస్తాను మెయింటైన్ కానీ పేరెంట్స్ చేయరు ఎంటెర్ టైన్
వందనాలు శ్రవణ తరంగ వాహిణి
వార్త విశేషాలు కోసం ఎదురు చూసేవాణ్ణి ఇప్పుడు అందుబాటలో చరవాణి
మాట పాటలు వింటున్నాం ఎక్కడైన కాని
ఘనంగా జరుపుకుందాం గణతంత్ర దినోత్సవం
భారత దేశం ప్రజాస్వామ్యమని చెప్పే మహోత్సవం
జాతీయ జెండా ఎగురవేసి చేసుకుందాం ఉత్సవం
నేడు వచ్చింది గణతంత్రం
స్ఫూర్తి నిచ్చింది స్వాతంత్రం
ప్రజాశ్రేయాస్సే కావాలి మంత్రం
ఓటరా నువ్వు వెయ్యాలి ఓటు
దాని కోసం తీసుకోకు ఏ నోటు
నచ్చిన వారిపై నొక్కు మీట
నచ్చక పోతే నొక్కు నోటా
నిష్పాక్షికతకు మారు పేరు ఎన్నికల సంఘం
ఈరోజే చెప్పండి మేము ఏ ప్రలోభాలకు లొంగం
నేడే తీసుకోండి ఓటరు ఐడి కార్డు
దొంగ ఓట్లు పారదోలేందుకు ఇది గార్డు
ప్రత్యేక హోదా రాదా ఆంధ్రులంటే మీకు చేదా
ఎన్నికల కోసం ధగా కాదా
ప్రత్యేక హోదా మా వాంక్ష
మీరు తీర్చరా ఈ కాంక్ష అధికారమే మీ ఆకాంక్ష
హామీ ఇచ్చి గెలిచారు గెలిచాక హోదా మరిచారు మోసపోతున్నామని గ్రహించారు
చేస్తున్నాం శాంతి పోరాటం
ప్రత్యేక హోదా కోసం ఈ ఆరాటం ఉద్యమం కావాలి విరాటం
భోగి మంటలతో వెన్నెల కాంతి
ఇదిగో మనకు తెచ్చింది సంక్రాంతి
కనుమ లో వెల్లివిరెసెను పసు క్రాంతి
డూడూ బసవన్న తో బాజా భజంత్రి
నిండెను ఊరంతా బంతి చామంతి
స్వా ర్ధం లేని జీవితం మీకే సాధ్యం
మి గిల్చారు తరతరాలకు మీ ఆదర్శ ఆలోచనలు
వి దేశాలలో భారతీయ సంస్కృతి చాటిన ఘనత
వే దిక ఎక్కితే ప్రసంగాలతో స్ఫూర్తి నింపే వక్త
కా లేరు మీలా మనో వైజ్ఞ్యానిక తత్త్వ వేత్త
నం దనవనమే మీరు అడుగుడిన ప్రతి చోట
ద శ శతాభ్దులు గడిచినా మరిచిపోదు ఈ పురిటి గడ్డ
సైనికులకు సందేశాలు పంపిస్తారు
కానీ వారి కడుపులు కాల్చేస్తారు
సైనికులకు వందనాలు అంటాం
వారి బాగోగులు కై ఎడ్డం టెడ్డెం అంటాం
కాంటీన్ లో సరుకులు వాడుకుంటారు
కడుపు నిండా పెట్టకుండా ఉంటారు