Sunday, 19 January 2025

లెండర్

బాకీ కోసం వదిలిపెట్టడు లెండర్
కిస్తి కట్టే వరకు వస్తుంది రిమైండర్
అది కూడా కట్టకపోతే వేసేస్తారు టెండర్
కొనుక్కోవటానికి రెడీగా ఉంటారు వెండర్ 

Thursday, 19 December 2024

మాట - 'టు'

కొందరి జీవితం నడుస్తుంది లేటు
పరుగెత్తుతోంది క్యాలెండర్ లోని డేటు
ఎప్పుడు మారుతుందో ఫేటు
ఎప్పటికైనా లైఫ్ ఈస్ ఆల్వేస్ గ్రేటు

Thursday, 14 November 2024

బాలల దినోత్సవం - 2024

మళ్ళీ వస్తుందా బాల్యం

ముసి ముసి నవ్వులకు ఉంటుందా మూల్యం

దొరుకుతుందా అప్పటి వాత్సల్యం

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి అమూల్యం


Saturday, 12 October 2024

మాట - " ష్టం "

రేయింబవళ్ళు పడే కష్టం

ఎప్పుడు ఫలించేనో అస్పష్టం

చేస్తున్న పని ఎంతో కొంత ఇష్టం

ఏ స్వార్థం లేదని చెప్పడం స్పష్టం


Tuesday, 17 September 2024

పైసా తిరిగిరావా

ఎన్నాళ్ళు పడాలి ఆవేదన

రూపాయి కోసం ఈ తపన

ఎగ్గొట్టేవాడికి బాధ తెలుసునా

ఏ పాపం చేస్తే ఈ కష్టం వచ్చునో

ఆశ ఉంది ధర్మం కాపాడుతుందని

Tuesday, 27 August 2024

ఓ నారి

మౌనమేల నీవు, ఓ నారి

పలువురు విశృంఖల చేష్టలతో మీకు ఉరి

మృగాల పోరుతో నిత్యం చేస్తున్నారు సవారి 

అలాంటి వారికి ఆలస్యం కాకుండా కట్టాలి గోరి

Friday, 19 July 2024

ఆశ

అతిగా ఆశపడకు నేస్తమా

నిరాశపరిచేవారుంటారమ్మా

నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారమ్మా

భ్రమలో ఎన్నేళ్ళు బతుకుతావమ్మా