మాట caru
Chartered Accountant, Wordist
Tuesday, 26 May 2026
ఆశ - రాశా
మది నిండా ఉంది ఒక ఆశ
కలవరపెడుతుంది ఏదో తెలియని నిరాశ
హద్దు దాటితే అవుతుంది దురాశ
జాగ్రత్త అంటూ ఈ పదాలు రాశా
Monday, 27 April 2026
ఎండలు
ఠారెత్తిస్తున్న ఎండలు
పగులుతున్న బండలు
ఎండుతున్న గుండాలు
కరుగుతాయేమో కొండలు
Sunday, 22 March 2026
కాలం
ముందుందిలే మంచి కాలం
అనుకుంటూ ఉందాం ఈ జీవిత కాలం
మనం చెప్పగలమా భూత భవిషత్ వర్తమానం
కోటి ఆశలతో జీవిద్దాం మిగిలిన కాలం
Sunday, 22 February 2026
మాట- ఫిబ్రవరి 2026
అబ్బురపరుస్తుంది వర్చస్సు
ప్రభావితం చేస్తున్నది తేజస్సు
ఉరకలేయిస్తుంది ఉషస్సు
మనోహరముగా ఉంది మనస్సు
Sunday, 18 January 2026
దోమ
దోమా మమ్మల్ని వదలవా
మహా నగరం పైన పగబట్టవా
ఆల్ల్లౌట్లూ , గుడ్ నైట్లూ ఉన్నాయని మరిచావా
స్వైర విహారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నావా
నిద్రపోకూడదని కంకణం కట్టుకున్నవా
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)