Sunday, 27 September 2026

మాట 'Sept'unna - 2026

ఎల్లప్పుడూ నీ ధ్యాస

నీవు వస్తావని ఆశ

నిన్ను మరువనంటుంది మనసా

జీవితంలో ఇదొక అనుభవం బహుశా

Tuesday, 25 August 2026

మాట - క్ష

ఈ జీవితమే ఒక భిక్ష

దేవుడు అండగా ఉంటూ ఇచ్చే రక్ష

పాటించు ఒక నిర్దిష్ట దీక్ష 

తప్పు చేస్తే పడుతుంది శిక్ష


Saturday, 25 July 2026

ప్రకృతి

ఎల్ నినో ప్రభావం ఎక్కువ

వానలు పడటం తక్కువ

ప్రకృతిని కాపాడటం పై ఉండాలి మక్కువ  

ప్రకృతిపై అవగాహన పెంచాలి అనేది నిక్కువ


Friday, 26 June 2026

జూన్ మాట - 2026

మారుతుంది కాలం
కానరావట్లేదు ధర్మం
ఇంతేనా ఈ లోకం
మార్పు కోరుకుంటుంది విశ్వం

Tuesday, 26 May 2026

ఆశ - రాశా

మది నిండా ఉంది ఒక ఆశ 
కలవరపెడుతుంది ఏదో తెలియని నిరాశ 
హద్దు దాటితే అవుతుంది దురాశ
జాగ్రత్త అంటూ ఈ పదాలు రాశా

Monday, 27 April 2026

ఎండలు

ఠారెత్తిస్తున్న ఎండలు 
పగులుతున్న బండలు
ఎండుతున్న గుండాలు
కరుగుతాయేమో కొండలు

Sunday, 22 March 2026

కాలం

ముందుందిలే మంచి కాలం
అనుకుంటూ ఉందాం ఈ జీవిత కాలం
మనం చెప్పగలమా భూత భవిషత్ వర్తమానం
కోటి ఆశలతో జీవిద్దాం మిగిలిన కాలం