Wednesday 29 March 2017

హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు


హేవళంబి నామ సంవత్సరానికి స్వాగతం 
షడ్రుచుల పచ్చడి జీవనానికి సంకేతం 
పంచాంగ శ్రవణం తెలుపుతుంది మనోగతం 
సుఖ సంతోషాలు వెదజిల్లాలి ఈ వసంతం 

Sunday 12 March 2017

Happy Holi

 విభిన్న రంగులు జిమ్ముకునే హొళీ
 మరెన్నో ఆనందాలు పంచే జలకేళి

 అందరికి ఇష్టమైన గులాబీ రంగుతో నిండే జన సందోహం
 అబ్బుర పరిచే పండుగని చెప్పడంలో లేదు నిస్సందేహం

 ఏ వయస్సు వారైనా ఆడే రంగులకేళి
 ఏకమవుతారు సంతోషాలతో జనావళి

Wednesday 8 March 2017

International Women's Day

నారి చేస్తావు నిత్యం బాధ్యతలతో సవారి       
ఎక్కడ ఉన్న నిర్వర్తిస్తావు కర్తవ్యం సరాసరి      
ఇల్లైన హరివిల్లైన నీవు లేనిదే నడవదు మరి            
                                                                
నింగి నేల తలవంచక తప్పదు నీ శక్తి ముందు   
తరాలు మారిన మరువవు సంప్రదాయమందు                
 నీ ఓర్పు సహనములకు ప్రణామాలు ముందు

తల్లి,చెల్లి,భార్య పేరు ఏదైనా నీకు వందనం  
కృషి పట్టుదలతో విజయం నీ సొంతం          చదువైనా,ఆటపాటలైన గెలవటం నీ పంతం