తప్పకుండా వేయి ఓటు
తీసుకోకూ ఏ పచ్చ నోటు
సమాజ ప్రగతికి అది పోటు
ప్రలోభాలకు ఇవ్వకు చోటు
Sunday, 7 October 2018
Thursday, 13 September 2018
వినాయక చవితి శుభాకాంక్షలు
విఘ్నాలను తొలగించే విధాత
తల్లిదండ్రులను గౌరవించే ఏక దంత
కోర్కెలు తీర్చే సిద్ధిబుద్ధి సమేత
భక్తి ప్రపతులతో కొలిచేము మేమంత
Wednesday, 15 August 2018
స్వతంత్ర దినోత్సవం
త్రివర్ణ పతాకం రెప రెపాలడిన రోజు
భారత దేశం స్వాతంత్రం గడించిన రోజు
సగటు భారతీయుడు గర్వించదగ్గ రోజు
ఎలుగెత్తి చాటు దేశ భక్తిని ప్రతి రోజు
Monday, 16 July 2018
పడవ ప్రమాదం
ప్ర'జల' కష్టాలు కన'పడవ'
ఆర్తనాదాలు విన'పడవ'
వంతెనలు గాడిన'పడవ'
ప్రభుత్వాలు భయ'పడవ'
మృత్యుఘోష వెంట'పడవ'
గోదారమ్మ శాంతిం'పడవ'
Friday, 8 June 2018
తిరుమల ఆలయం
తిరుమల ఆలయం
సమస్యల వలయం
ఆచారాలు తుంగలో తొక్కు
అపచారాలు నింగిని తాకు
ఆపద మ్రొక్కుల వాడికి దిక్కెవరు
భక్తుల నమ్మకానికి అడ్డురారెవ్వరు
Sunday, 13 May 2018
Sunday, 8 April 2018
ఆంధ్ర కోసం
ఆంధ్రుల ప్రయోజనాలు పట్టవా
అధికారంలోకి వచ్చాకా మరిచావ
ఓటేసినందుకు ప్రజలను శిక్షించావ
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయవా
Subscribe to:
Posts (Atom)