Wednesday, 29 March 2017
హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు
Sunday, 12 March 2017
Happy Holi
మరెన్నో ఆనందాలు పంచే జలకేళి
అందరికి ఇష్టమైన గులాబీ రంగుతో నిండే జన సందోహం
అబ్బుర పరిచే పండుగని చెప్పడంలో లేదు నిస్సందేహం
ఏ వయస్సు వారైనా ఆడే రంగులకేళి
ఏకమవుతారు సంతోషాలతో జనావళి
Wednesday, 8 March 2017
International Women's Day
నారి చేస్తావు నిత్యం బాధ్యతలతో సవారి
ఎక్కడ ఉన్న నిర్వర్తిస్తావు కర్తవ్యం సరాసరి
ఇల్లైన హరివిల్లైన నీవు లేనిదే నడవదు మరి
నింగి నేల తలవంచక తప్పదు నీ శక్తి ముందు
తరాలు మారిన మరువవు సంప్రదాయమందు
నీ ఓర్పు సహనములకు ప్రణామాలు ముందు
తల్లి,చెల్లి,భార్య పేరు ఏదైనా నీకు వందనం
కృషి పట్టుదలతో విజయం నీ సొంతం చదువైనా,ఆటపాటలైన గెలవటం నీ పంతం
Tuesday, 28 February 2017
Private Buses Horror
తీరు మారని ప్రై"వేటు" బస్సులు
ప్రజల ప్రాణాలకి లేదు విలువలు
ప్రమాదాలు ఎన్నైనా ఆగని చక్రాలు
భద్రత కన్నా డబ్బు మీదే ఆశలు
ఆకాశమంత ఎత్తులో టిక్కెట్టు ధరలు
రూల్స్ పాటించడానికి రావు చేతులు
Friday, 24 February 2017
మహా శివరాత్రి శుభాకాంక్షలు
శివా శివా పరమ శివ
నీతో నే మా విజయి భవ
లోకాన్ని పాలించేది నువ్వేనయ మమ్మల్ని రక్షించేది నీవేనయ
నీ ఆజ్ఞ కోసం వేెచుండాలయా మమ్ము చల్లంగా చూడాలయా
అన్ని రూపాల్లో నీవుంటావు ఎక్కడున్నా మా కరుణ కోరుకుంటావు
Tuesday, 14 February 2017
Valentines Day
నీపై ప్రేమ ఉందని తెలపనా
నా మనసు దోచావని అరవనా
ప్రతి రోజు గుర్తొస్తావాని చెప్పినా ఎందుకు ఈరోజే కలవాలని తపనా
ఇదిగో విను వాలెంటైన్ ప్రేమను కురిపించే ఫౌంటైన్ నిన్ను చేస్తాను మెయింటైన్ కానీ పేరెంట్స్ చేయరు ఎంటెర్ టైన్
Monday, 13 February 2017
World Radio Day
వందనాలు శ్రవణ తరంగ వాహిణి
వార్త విశేషాలు కోసం ఎదురు చూసేవాణ్ణి ఇప్పుడు అందుబాటలో చరవాణి
మాట పాటలు వింటున్నాం ఎక్కడైన కాని