Sunday, 21 August 2022

'తం'తు

నువ్వు లేని జీవితం
ఊహించని పరాజితం
ఒంటరితనానికి స్వాగతం
జ్ఞాపకాలన్నీ ఊహాలకే పరిమితం

Sunday, 17 July 2022

కరోనా - జూలై 2022

మళ్ళీ కరోనా చెప్తుంది హాలో
ఇక దగ్గర పెట్టుకోండి డోలో
మాస్క్ పెట్టుకుని ఛలో ఛలో
బూస్టర్ డోస్ కి జై బోలో

Wednesday, 15 June 2022

పిల్ - పిల్లో

నిన్ను వేసుకోకుండా ఉంటే ఎలా పిల్ - టాబ్లెట్
నిన్ను ఉపయోగించడం ఒక ఆయుధం గా పిల్ - కోర్టుల్లో 
నీవు లేకుంటే నిద్రరాదు పిల్లో - తలగడ
నిన్ను పాలు తాగకుండా ఉంచడం కష్టమే పిల్లో - మార్జాలం

Sunday, 8 May 2022

మదర్స్ డే శుభాకాంక్షలు

ఒడిదుడుకులు లోనైనా
కాయా కష్టం చేసైనా
ప్రాణాలు పణంగా పెట్టైనా
పిల్లల్ని ప్రేమగా పెంచేనుగా 
నీ ఋణం ఎప్పటికీ తీరదుగా

Sunday, 10 April 2022

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

నిన్నే బ్రోచెను రామయ్యా
నీ జీవితమే ఆదర్శమయా
మీ గుణములు మాకు రావాలయ్య
మమ్మల్ని సన్మార్గంలో నడిపించవయా

Tuesday, 1 March 2022

మహా శివరాత్రి - 2022

పంచభూతాలు నీ ఆధీనంలోనేగా
ఈశ్వరా అంతటా నీవే నయా 

గంగమ్మను నెత్తిన గౌరమ్మను వెంటబెట్టుకొని
ఈ లోకమంతా తిరుగుతుంటావయా

ఆపదల నుండి కాపాడే మహాదేవా
నీవు అభిషేక ప్రియునివయా 

హాలాహలం సేవించితివయా
సర్పాలను మెడలో ధరించితివయా

వైకుంఠ ధామలలో ఉంటావయా
శివ తాండవంతో అలరిస్తావయా

నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదుగా
మాయందు నీ చల్లని చూపు చాలయ్య

Monday, 14 February 2022

ఇది కాదు ప్రేమ

నీ పైన ఉంది మోజ్
చేసేస్తాను ప్రపోజ్
ఇచ్చేస్తాను ఒక రోజ్
చేసేసుకుందాం మారేజ్
ఆ తరవాత అవొద్దు నారాజ్
అంతటితో చాప్టర్ క్లోజ్