మళ్ళీ వస్తుందా బాల్యం
ముసి ముసి నవ్వులకు ఉంటుందా మూల్యం
దొరుకుతుందా అప్పటి వాత్సల్యం
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి అమూల్యం
మళ్ళీ వస్తుందా బాల్యం
ముసి ముసి నవ్వులకు ఉంటుందా మూల్యం
దొరుకుతుందా అప్పటి వాత్సల్యం
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి అమూల్యం
రేయింబవళ్ళు పడే కష్టం
ఎప్పుడు ఫలించేనో అస్పష్టం
చేస్తున్న పని ఎంతో కొంత ఇష్టం
ఏ స్వార్థం లేదని చెప్పడం స్పష్టం
ఎన్నాళ్ళు పడాలి ఆవేదన
రూపాయి కోసం ఈ తపన
ఎగ్గొట్టేవాడికి బాధ తెలుసునా
ఏ పాపం చేస్తే ఈ కష్టం వచ్చునో
ఆశ ఉంది ధర్మం కాపాడుతుందని
మౌనమేల నీవు, ఓ నారి
పలువురు విశృంఖల చేష్టలతో మీకు ఉరి
మృగాల పోరుతో నిత్యం చేస్తున్నారు సవారి
అలాంటి వారికి ఆలస్యం కాకుండా కట్టాలి గోరి
అతిగా ఆశపడకు నేస్తమా
నిరాశపరిచేవారుంటారమ్మా
నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారమ్మా
భ్రమలో ఎన్నేళ్ళు బతుకుతావమ్మా
మోసం అనే ఒక రోగం
అసలుందా నీకు ఔషధం
పట్టదా ఎదుటివారి ఆవేదన
దేవుడా ఎన్నాళ్ళీ నిర్వేదన
వదిలించు మాకు దౌర్భాగ్యం
కాసింతైనా కలిగించు భాగ్యం
ఓటు మనదిరా
ఓటేసే హక్కు మనదిరా
ప్రశ్నించే హక్కు ఉందిరా
ఐదేళ్లకోసారి వచ్చే అవకాశం ఇదిరా
నీ ఓట్లమ్ముకోకూరా
నిజాయితీతో ఓటేయరా
నచ్చిన అభ్యర్ధి పైన మీట నొక్కురా
నచ్చకపోతే నోటాను నొక్కురా
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది
మమ్ముల్ని చేయకు ఎవరికి విరోధి
ప్రసాదించు సుఖ సంతోషాల పడి
ఇవ్వు ఆయు ఆరోగ్యాల సవ్వడి
ఆనంద ఆనందమాయే వెన్నెలా
నిద్ర పుచ్చట్లేదు ఎందుకలా
చరవాణి చూడకుండా ఉండేలా
ఏదైనా మార్గం చూపిస్తేపోలా
అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టంటా
ఈ ప్రతిష్టను కీర్తించెను దేశమంతా
దేశమంతా రామరాజ్యం తిరిగి వచ్చేనంటా
ఊరంతా రాములోరు పండగంటా