Tuesday, 21 December 2021

మాట

కొందరి మాటలు తూటాలు
మరికొందరి మాటలు పాఠాలు
వినసొంపుగా ఉంటే మధుర ఘట్టాలు 
లేకుంటే అవి తెస్తాయి తంటాలు

Monday, 29 November 2021

ప్రకృతి

అమూల్యమైనది ఈ ప్రకృతి
చెడగొట్టవద్దు వాటి ఆకృతి
పర్యావరణ విజ్ఞానం కావాలి జాగృతి
కొంతైనా ఆపుతుంది ఈ వికృతి

Friday, 15 October 2021

దసరా

దసరా వచ్చేరా
సంబరం తెచ్చేరా

పాలపిట్టను చూద్దాం
శమీ చెట్టును పూజిద్దాం 

అలయి బలయి అందాం
సుఖ సంతోషాలతో ఉందాం

Monday, 27 September 2021

మనీ

కొందరికి సంపాదిస్తే వచ్చే మనీ
మరికొందరికి మాత్రము ఓ గని
నేడంతా డబ్బుతోనే ముడి కానీ
బ్రతకాలంటే చేయక తప్పదు ఎదో పని

Tuesday, 24 August 2021

పదం పథం

కొంతమందికి కావాలి మనిషి
ఇంకొంతమందికి కావాలి 'మని'షి

కొందరికి చెప్పాలి నువ్వుంటే వెల్లువ 
మరికొందరికి చెప్పాలి నువ్వుంటే 'వెళ్లు'వ

Monday, 19 July 2021

బంధీ

నాడు సెల్లు లో బంధీ
నేడు సెల్లు తో బంధీ
ఎటూ తప్పదు బాదర బందీ
అవునేమో ఈ జిందగీ ఓ జుగల్ బందీ

Saturday, 12 June 2021

జూన్ 2021

అరె నమస్తే 2021 జూన్ 
రోజులు గడిస్తున్నాయి సూన్ 
కరోనా కొంచెం తగ్గడం బూన్
దయుంచి కోవిడ్ తగ్గించండి సన్ మూన్

Saturday, 22 May 2021

వేటూరి గారు

తెలుగు సాహిత్యానికి మీరొక 'వే'
మీకు సాటి లేరు అటు ఇ'టూ'
దశాబ్దలైనా మీ పాటలని మరువలేము మ'రి'
అందుకోండి మా చిరు నీరాజనాలు

Sunday, 18 April 2021

కరోనా - 2021 ఏప్రిల్ పోస్ట్

పెట్టుకోండి మాస్క్స్
లేకుంటే కరోనా రాక్స్ 
ఎంత మందిని రక్షిస్తారు డాక్స్
లేకుంటే రెడీగా ఉంటుంది కాఫిన్ బాక్స్

Wednesday, 24 March 2021

కరోనా - 2021

కరోనా నీకు లేదా షట్ డౌన్
మళ్ళీ పెడతారేమో లాక్ డౌన్
నువ్వు డౌన్ కాకుండా అయ్యావు డాన్
మా వాక్సిన్ నీ పాలిట కావాలి గన్

Wednesday, 24 February 2021

జీవితం

శాశ్వతమా ఈ జీవితం
ఎత్తు పల్లాల సహితం
ఆశా నిరాశల సంహితం
మార్చలేమా బ్రహ్మ లిఖితం

Friday, 1 January 2021

హ్యాపీ న్యూ ఇయర్ - 2021

మారిందిగా క్యాలెండర్ 
వాక్సిన్ చేస్తుందా 202'1డర్'
కరోనాకు తెలీదు జెండర్ 
జాగ్రత్తలు కోసం రిమైండర్
హ్యాపీ న్యూ ఇయర్ రీడర్