Monday, 14 December 2020

ఓం నమః శివాయ

నీ ఆజ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు
నీ పేరు తలవనిదే రోజు గడవదు
నీ పైన భక్తి ఎన్నటికీ చెరగదు
కుటుంబ ఐక్యత నీ నుండి నేర్చుకోక తప్పదు

Friday, 20 November 2020

ఎన్నికలు - ఓటు

వేయండి ఓటు
తీసుకోవద్దు నోటు
అవినీతికి ఇవ్వొదు చోటు
ఇస్తే మనకే తిరిగిస్తుంది పోటు

Tuesday, 20 October 2020

హైదర'బాధ'

ఏమిటో హైదర'బాధ'
కబ్జా ఐన చెరువుల గాధ 
ప్రకృతి నాశనం చేసింది మనం కాదా
ఇప్పటినుండైన మార్పు రాదా

Friday, 11 September 2020

వెలుగు - చీకటీ

వెలుగు ఒక అందం
చీకటీ ఒక మకరందం
రెండిటివి విడదీయలేని బంధం
ఇవి లేకుంటే ఈ విశ్వం దుర్గంధం

Sunday, 2 August 2020

స్నేహితుల దినోత్సవం 2020

ఫ్రెండు నువ్వు తోడు ఉండు
ఏది చేసినా అవ్వాలి ట్రెండు
జ్ఞాపకాలతో నిండుతోంది మైండు
ఆత్మీయ కలయికలతో వేయాలి రివైండు

Tuesday, 14 July 2020

కూ - koo app - social networking in regional languages

మీ'కూ' అంటూ ముందుకు వస్తోంది
మాతృభాష'కూ' వన్నె తెస్తుంది
తెలుగులో 'కూ'యిస్తుంది
'కూ'డకూడలా విస్తరణ చెందుతుంది 

Tuesday, 16 June 2020

కరోనా - జూన్ 2020

జూన్ వెళ్ళిపోతుంది
జులై కూడా వచ్చేస్తుంది
కరోనా ఎప్పుడు పోతుంది 
దేశాన్ని ఎన్నడు కాపాడుతుంది

కరోనా కుచ్ కరోనా
తుం సే దూర్ కరోనా 
పరేషాన్ నా కరోనా 
జిందగి బార్బత్ నా కరోనా


Friday, 1 May 2020

కరోనా మే -2020

ఈ నెల ఎంతైనా సాహస'మే'
ధ్యేయం కరోనాను తరిమికొట్టడ'మే'
లాక్డౌన్ ఎత్తేస్తారా అని చూడడ'మే'
తధ్యం కోవిడ్ వారియర్స్ ను అభినందించడ'మే'
గడ్డు ఆర్ధిక పరిస్థితిని ఎదుర్కొనడ'మే'
ఉద్యోగాలు నిలుస్తాయా అని చూడడ'మే'
అగ్ని పరీక్ష పెడుతున్న శార్వరి ని భరించట'మే'
మరో పక్క ఎండలు మండే కాల'మే'
మనిషి బాధలు భరించమంటే కష్ట'మే'

Wednesday, 8 April 2020

కరోనా - లాక్ డౌన్

కరోనా నీవల్లే మాకు గృహ నిర్బంధం
ప్రబలకుండా చేస్తున్న ప్రయత్నం స్వచ్చంధం
దూరంగా ఉంటేనే ఉంటుంది బంధం
తిరిగితే పడుతోంది లాఠీ దెబ్బ తోలు మందం

Sunday, 8 March 2020

అంతర్జాతీయ మహిళా దినోత్సవం - 2020

ప్రణతోస్మి ఓ నారి 
జీవితంలో సగం నీవే సరా సరి 
పాత్ర ఏదైనా ఒదిగిపోతావు మరి
ఈ విశ్వమంతా నీతోనే ఉభయ కుసులోపరి

Monday, 17 February 2020

విరహం

అనుభవించటం నరకం
కళ్ళ ముందుంటుంది మారకం 
ఎవరో మరి ఈ విరహానికి కారకం 
తప్పించుకునేందుకు కావాలి తారకం

Monday, 20 January 2020

అమరావతి పోరాటం

ఏమవుతున్నది అమరావతి
భూమిలిచ్చిన వారి జీవనం తిరోగతి 
పాలకులకు మొండితనమే పరపతి
ఎవరు మారుస్తారో ఈ దుర్గతి