నా కంట పడ్డావు
ప్రేమ పుట్టించావు
మనసు దోచావు
నా లోకి ప్రవేశించావు
ఆనందాన్ని ఇచ్చేసావు
నచ్చేనే నీ స్వరం
కలవడమే వరం
కలిపేను కరం
నీతోనే ఈ తరం
తపిస్తానంటున్న హృదయం
వేచిచూస్తామంటున్న నయనం
స్మరిస్తానంటున్న నాసికం
వింటామంటున్న కర్ణం
ప్రేమకోసమేనంటున్న పయనం