చిట్టచివర నిలిచేది మధుర జ్ఞాపకమా
లేక మిగిల్చేది కన్నీటి రుధిరమా
ఇది శాపమా లేక వరమా
కొంచెం తెలిస్తే చెప్పుమా
Chartered Accountant, Wordist
మళ్ళీ వస్తుందా బాల్యం
ముసి ముసి నవ్వులకు ఉంటుందా మూల్యం
దొరుకుతుందా అప్పటి వాత్సల్యం
చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి అమూల్యం
రేయింబవళ్ళు పడే కష్టం
ఎప్పుడు ఫలించేనో అస్పష్టం
చేస్తున్న పని ఎంతో కొంత ఇష్టం
ఏ స్వార్థం లేదని చెప్పడం స్పష్టం
ఎన్నాళ్ళు పడాలి ఆవేదన
రూపాయి కోసం ఈ తపన
ఎగ్గొట్టేవాడికి బాధ తెలుసునా
ఏ పాపం చేస్తే ఈ కష్టం వచ్చునో
ఆశ ఉంది ధర్మం కాపాడుతుందని