మాట caru
Chartered Accountant, Wordist
Monday, 14 December 2020
ఓం నమః శివాయ
నీ ఆజ్ఞ లేనిదే చీమ ఐనా కుట్టదు
నీ పేరు తలవనిదే రోజు గడవదు
నీ పైన భక్తి ఎన్నటికీ చెరగదు
కుటుంబ ఐక్యత నీ నుండి నేర్చుకోక తప్పదు
Friday, 20 November 2020
ఎన్నికలు - ఓటు
వేయండి ఓటు
తీసుకోవద్దు నోటు
అవినీతికి ఇవ్వొదు చోటు
ఇస్తే మనకే తిరిగిస్తుంది పోటు
Tuesday, 20 October 2020
హైదర'బాధ'
ఏమిటో హైదర'బాధ'
కబ్జా ఐన చెరువుల గాధ
ప్రకృతి నాశనం చేసింది మనం కాదా
ఇప్పటినుండైన మార్పు రాదా
Friday, 11 September 2020
వెలుగు - చీకటీ
వెలుగు ఒక అందం
చీకటీ ఒక మకరందం
రెండిటివి విడదీయలేని బంధం
ఇవి లేకుంటే ఈ విశ్వం దుర్గంధం
Sunday, 2 August 2020
స్నేహితుల దినోత్సవం 2020
ఫ్రెండు నువ్వు తోడు ఉండు
ఏది చేసినా అవ్వాలి ట్రెండు
జ్ఞాపకాలతో నిండుతోంది మైండు
ఆత్మీయ కలయికలతో వేయాలి రివైండు
Tuesday, 14 July 2020
కూ - koo app - social networking in regional languages
మీ'కూ' అంటూ ముందుకు వస్తోంది
మాతృభాష'కూ' వన్నె తెస్తుంది
తెలుగులో 'కూ'యిస్తుంది
'కూ'డకూడలా విస్తరణ చెందుతుంది
Tuesday, 16 June 2020
కరోనా - జూన్ 2020
జూన్ వెళ్ళిపోతుంది
జులై కూడా వచ్చేస్తుంది
కరోనా ఎప్పుడు పోతుంది
దేశాన్ని ఎన్నడు కాపాడుతుంది
కరోనా కుచ్ కరోనా
తుం సే దూర్ కరోనా
పరేషాన్ నా కరోనా
జిందగి బార్బత్ నా కరోనా
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)