బతుకమ్మ బతుకమ్మ
ఊరంతా సంబరమమ్మ
ఇంటింటా కొలిచే గౌరమ్మ
అందరినీ చల్లంగా చూడమ్మ
బతుకమ్మ బతుకమ్మ
తెలంగాణ పండగమ్మ
తంగేడు పూలతో అలంకరించామమ్మ
ఆటపాటలతో సందడి చేసినామమ్మ
బతుకమ్మ బతుకమ్మ
ఊరంతా సంబరమమ్మ
ఇంటింటా కొలిచే గౌరమ్మ
అందరినీ చల్లంగా చూడమ్మ
బతుకమ్మ బతుకమ్మ
తెలంగాణ పండగమ్మ
తంగేడు పూలతో అలంకరించామమ్మ
ఆటపాటలతో సందడి చేసినామమ్మ
విద్యలు నేర్పే గురువులు
సన్మార్గము చూపే పెద్దలు
వెలకట్టలేనివి మీ బోధనలు
మరువలేనివి మీ సూక్తులు
మీ అందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు
ప్రతి అడుగులో ఉత్తేజం
ప్రతి మాటలో ఉత్సాహం
ఈ స్నేహం ఏంతో అమూల్యం ఎల్లపుడు నిలవాలి స్నేహ బంధం
కావాలి ప్రతి రోజు స్నేహితుల దినోత్సవం
గ"మ్మత్తు"గా ఉంది నాకేమి తెలిదంటే
నమ్మాలా సినీ జగత్తు మాయలో లేదంటే
జంకుతున్నారు తప్పును ఒప్పుకోమంటే
భయమా కారాగారానికి వెళ్లాలంటే
రక్తమోడుతున్న మంచు కాశ్మీరం
మంచు లింగం దర్శనానికి వెళ్తూ ఘోరం
ఎప్పటికైనా తీవ్రవాదం నిర్వీర్యం
ఎన్నటికీ దేశప్రజలకు తగ్గదు ధైర్యం
వీర సైనికుల పోరాటం అజరామరం
బస్సు డ్రైవరు సాహసం అభినందనీయం
బుడి బుడి అడుగులు వేయించావు
మా అభ్యున్నతి కోరుకుంటావు
మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు నాన్న నీ అడుగుజాడల్లో సాగిపోతూ
నలుమూలలు చేరిన నవ్యాంధ్ర కీర్తి
అమరావతి తెచ్చెను విశ్వ ఖ్యాతి
ముందుకు దూసుకువెళ్తున్న ప్రగతి
ప్రజలు విశ్వసించెను పురోగతి