Sunday, 17 September 2023

మాట - క్ర

జీవితమనే చక్రంలో

ఒడిదుడుకులు క్రమంలో

అడ్డుకోవాలి విష్ణు చక్రంలా

ఎదురు నిలబడాలి పరాక్రమంతో 

Tuesday, 22 August 2023

చంద్రయాన్ 3

ఇస్రో మీ వెంటే ఉంది భారతదేశం 
చంద్రయాన్ 3 కావాలి విజయవంతం 
శాస్త్రవేత్తల కృషి అవ్వాలి సఫలీకృతం
వెన్నెల పై రెపరెపలాడాలి త్రివర్ణ పతాకం 

Thursday, 13 July 2023

సెల్లు - కళ్ళు

పట్టుకుంటే విడువదు ఈ సెల్లు
వ్యసనం కాకుండా మోగించండి బెల్లు 
మనకు ఉన్నవి రెండేగా విలువైన కళ్ళు 
అవి పాడైతే భాదపడాలి రేయింబవళ్ళు

Friday, 16 June 2023

రోజు

రోజుకో మలుపు తిరిగే జీవితం 
రోజూ ఎలా ఒకటేలా ఉంటుంది
రోజంతా ఆలోచించినా మారదు రాత
ప్రతిరోజును ఆస్వాదించు, ఏదో ఓ రోజు నీదే 

Wednesday, 24 May 2023

జీవితమే'ల'

జీవితమే ఓ ఊయల
ఆనందం ఉన్నప్పుడు హాయిగా కోయిలలా 
దుఖం అప్పుడు అవ్వడం ఖాయిలా
ఉండిపోరాదా బండ రాయిలా
ఏవీ పట్టించుకోకుండా ఉంటే నయమేల

Monday, 10 April 2023

పైసా

నేడు కావలసిందే పైసా
ఎవరికి ఉండదు ఆశా
ఎన్నో ఆటుపోట్లు చూస్తున్నా
బ్రతుకు పోరాటం చేస్తున్నా

Thursday, 16 March 2023

ఊహా'లలు'

క'లలు' కళ్ళ ముందు కదలాడే
అ'లలు' గుండె పైన ఎగిసిపడే 
శి'లలు' గా మారిన రాళ్ళు తేలియాడే 
నె'లలు' పాటు నీ కోసం చూడబడే