మాట caru
Chartered Accountant, Wordist
Friday, 21 January 2022
ఆలోచన చెబి'తి'
ఏమో ఆలోచలన్ని అతి
దారి తప్పుతుందా గతి
ఎటూ తేల్చుకోలేని మతి
ఎక్కడో తెలియని భీతి
ఎటూ అర్థం కాదు ఈ రీతి
Tuesday, 21 December 2021
మాట
కొందరి మాటలు తూటాలు
మరికొందరి మాటలు పాఠాలు
వినసొంపుగా ఉంటే మధుర ఘట్టాలు
లేకుంటే అవి తెస్తాయి తంటాలు
Monday, 29 November 2021
ప్రకృతి
అమూల్యమైనది ఈ ప్రకృతి
చెడగొట్టవద్దు వాటి ఆకృతి
పర్యావరణ విజ్ఞానం కావాలి జాగృతి
కొంతైనా ఆపుతుంది ఈ వికృతి
Friday, 15 October 2021
దసరా
దసరా వచ్చేరా
సంబరం తెచ్చేరా
పాలపిట్టను చూద్దాం
శమీ చెట్టును పూజిద్దాం
అలయి బలయి అందాం
సుఖ సంతోషాలతో ఉందాం
Monday, 27 September 2021
మనీ
కొందరికి సంపాదిస్తే వచ్చే మనీ
మరికొందరికి మాత్రము ఓ గని
నేడంతా డబ్బుతోనే ముడి కానీ
బ్రతకాలంటే చేయక తప్పదు ఎదో పని
Tuesday, 24 August 2021
పదం పథం
కొంతమందికి కావాలి మనిషి
ఇంకొంతమందికి కావాలి 'మని'షి
కొందరికి చెప్పాలి నువ్వుంటే వెల్లువ
మరికొందరికి చెప్పాలి నువ్వుంటే 'వెళ్లు'వ
Monday, 19 July 2021
బంధీ
నాడు సెల్లు లో బంధీ
నేడు సెల్లు తో బంధీ
ఎటూ తప్పదు బాదర బందీ
అవునేమో ఈ జిందగీ ఓ జుగల్ బందీ
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)