Monday, 17 February 2020

విరహం

అనుభవించటం నరకం
కళ్ళ ముందుంటుంది మారకం 
ఎవరో మరి ఈ విరహానికి కారకం 
తప్పించుకునేందుకు కావాలి తారకం

Monday, 20 January 2020

అమరావతి పోరాటం

ఏమవుతున్నది అమరావతి
భూమిలిచ్చిన వారి జీవనం తిరోగతి 
పాలకులకు మొండితనమే పరపతి
ఎవరు మారుస్తారో ఈ దుర్గతి

Monday, 9 December 2019

కాలేజీ రోజులు

అనిపించేది ఎందు"కా'లేజీ'
గుర్తుకొస్తుంది మా వి'లేజీ'
స్నేహితులతో ఉంటే మై'లేజీ'
ఇంతకీ ఏంటంటే మేము సో' లేజీ'

Friday, 22 November 2019

ఒక ఆలోచన

ఆశా నిరాశలలో లేదు అబేధం
దశా దిశల కూర్పులో లేదు విభేదం
రాత్రి పగలు కు తెలియదు ఖేదం
పుట్టుక గిట్టుక మధ్యలో ఉండాలి మోదం

Monday, 28 October 2019

ఓ ప్రేమ గాధ

ప్రేమతో కట్టుకున్న గూడు చెదరగా
భారంగా ముందుకు కదిలి వెళ్లగా
చేజారిన మనసును అడిగెను
ఒంటరిగా నిను వదిలి ఎలా ఉండగలను

Monday, 23 September 2019

గెలుపు - మలుపు

చెంతచేరిన ఓ గెలుపు
గెలుపుతో జీవితం మలుపు
మలుపులతో ఎదో అయ్యెను నలుపు
నలుపులు తాత్కాలికమనే తెలుపు

Thursday, 29 August 2019

తెలుగు భాషా దినోత్సవం

తేట తెలుగు పలుకు
మాతృభాష తెలుగు తేనె లొలుకు

భాషావృద్ధికి మేలుకొలుకో
జాతి సంపదను కాపాడుకో