అనిపించేది ఎందు"కా'లేజీ'
గుర్తుకొస్తుంది మా వి'లేజీ'
స్నేహితులతో ఉంటే మై'లేజీ'
ఇంతకీ ఏంటంటే మేము సో' లేజీ'
చెంతచేరిన ఓ గెలుపు
గెలుపుతో జీవితం మలుపు
మలుపులతో ఎదో అయ్యెను నలుపు
నలుపులు తాత్కాలికమనే తెలుపు
తేట తెలుగు పలుకు
మాతృభాష తెలుగు తేనె లొలుకు
భాషావృద్ధికి మేలుకొలుకో
జాతి సంపదను కాపాడుకో
పూర్వికులు ప్రసాదించిన యోగా
దూరం చేస్తుంది చాలా రోగా
ఫోటోల ఫోజు కోసం చేస్తాం బాగా
ఆ తరువాత మరువటం షరా మామూలేగా