Friday, 28 June 2019

యోగా

పూర్వికులు ప్రసాదించిన యోగా
దూరం చేస్తుంది చాలా రోగా
ఫోటోల ఫోజు కోసం చేస్తాం బాగా
ఆ తరువాత మరువటం షరా మామూలేగా

Wednesday, 29 May 2019

వేసవి

వేసవి ఏమిటీ హతవిధి
జనాలు బయట తిరిగే దారేది
ఎండను తట్టుకునే శక్తి ఏది
'వాతా'వరణం కలుషితం వల్లేనా ఇది

Saturday, 6 April 2019

వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ సంవత్సర ఉగాది వికారి
ప్రతీ ఒక్కరు అవ్వాలి పరోపకారి
దేశ శ్రేయస్సుకు కావాలి సహకారి
ప్రకృతి పరిరక్షణతో అవ్వు మమకారి

Monday, 4 March 2019

మహా శివరాత్రి శుభాకాంక్షలు

సమస్త ప్రాణకోటి ఆధారమయ్యా
మానవుడైన బైరాగివైన నువ్వేనయ్యా
నీ చల్లని చూపే మాకు చాలయ్య
ఎన్నో నామాలున్నాయి శివయ్యా
మరి రూపమేమో నీకు లేదయ్యా
శివకుటుంబం అందరికి ఆదర్శమయ్యా
నిన్ను కొలవలేనిదే ఉండేలేమయ్యా
పంచాక్షరీ మంత్రం జపిస్తే కరుణిస్తావయ్య

Thursday, 14 February 2019

ప్రేమ మాటలు

నా కంట పడ్డావు
ప్రేమ పుట్టించావు
మనసు దోచావు
నా లోకి ప్రవేశించావు
ఆనందాన్ని ఇచ్చేసావు

నచ్చేనే నీ స్వరం
కలవడమే వరం
కలిపేను కరం
నీతోనే ఈ తరం

తపిస్తానంటున్న హృదయం
వేచిచూస్తామంటున్న నయనం
స్మరిస్తానంటున్న నాసికం
వింటామంటున్న కర్ణం
ప్రేమకోసమేనంటున్న పయనం

Tuesday, 15 January 2019

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

రైతన్నల పండగ పొంగల్
గాలిపటాలతో నిండేను జంగల్
జరిగేను కోడి పందేలా దంగల్
చిన్నా పెద్దా అందరూ మింగిల్

Wednesday, 5 December 2018

ఓటు గురించి

డబ్బులకు లోబడద్దు
ఓటును అమ్ముకోవద్దు
ప్రలోభాలకు లొంగవద్దు
అభివృద్ధికి దూరమవ్వద్దు

ఓటు వేయడం హక్కు
వేయలేకపోవడం బాడ్ లక్కు
నీకిష్టమైన మీట నొక్కు
నేతలను ప్రశ్నించేందుకు ఇది చెక్కు