ప్రాణం పోసిన జనని
వెలకట్టలేము నీ ప్రేమని
కాలం తీరు మారని
మరువద్దు అమ్మని
ఆంధ్రుల ప్రయోజనాలు పట్టవా
అధికారంలోకి వచ్చాకా మరిచావ
ఓటేసినందుకు ప్రజలను శిక్షించావ
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయవా
అన్యాయం ఆగ లేదు
ప్రత్యేక హోదా లేదు
రైల్వే జోన్ ఊసే లేదు
ఆంధ్రులకు చేయూత లేదు
ఒత్తిడికి లొంగై
ఢిల్లీ భయపడై
శాపం ఆంధ్రాకై
అ నుండి ఱ వరకు చూడకుండా చెప్పలేము
వార్త పత్రికల్లో వార్తలు చదవలేము
పరాయి భాష మాట్లాడకుండా ఉండలేము
మరైతే మాతృభాషను ఎప్పుడు వాడలేము
రైల్వే జోన్ కై వైజాగో జాగో
ఆంధ్ర రాష్ట్రానికి అది ఒక లోగో
ఎన్నికలప్పుడు హామీ ఇదిగో అదిగో
ఇప్పుడు ఇవ్వమంటే నాయకులు భాగో
అదిగో అమరావతి
వైభవం తెచ్చెను ఆకృతి
పులకించెను ప్రకృతి
ప్రత్యేకము ఈ అవని
ఆంధ్ర రాష్ట్ర రాజధాని
గర్వించెను భారతావని
సంవత్సరమైంది రద్దై పెద్ద నోటు
ఇంకా తగ్గని సామాన్యుడి ఎడ పాటు
నోట్ల రంగుతో సరితూగేను నువ్వేసే కోటు
ప్రశ్నర్ధకాము అయ్యెను నీకు వేసే ఓటు
పెద్ద నోట్ల రద్దు తెచ్చింది రూపు
డిజిటల్ వాల్లెట్లకి వచ్చింది ఊపు
పడ్డాయి వాటిపై ప్రజలందరి చూపు
కానీ చిన్న వ్యాపారులకు దొరకని లూపు