Sunday, 28 September 2025

ఏ ఐ కాలం

అంతా "ఏ ఐ" కాలం
సృష్టించిన వాడికి సలాం
చిటికెలో మాయాజాలం
సాహో అంతర్జాలం 

Friday, 29 August 2025

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

మన మాతృ భాష తెలుగు
నింపెను వెలుగు
పర భాష జ్ఞానం పెంచుకో
తెలుగును యాదిలో ఉంచుకో

Saturday, 26 July 2025

మా వైటీ

ఓహ్ మై డియర్ వైటీ
ఈ లోకంలో అయిపోయింది నీ డ్యూటీ
ఈరోజు తీసుకెళ్ళిపోయాడు ఆల్మైటీ
మిస్ యూ మై బ్యూటీ

Sunday, 22 June 2025

యోగా - 2025

ఆరోగ్యం కోసం చేయాలి యోగా
మార్పులు తెస్తుంది మెల్లగా
తొలినాళ్లలో ఆసనాలు కష్టమేగా
అలవాటు అయితే సులువేగా 

Tuesday, 20 May 2025

సిరివెన్నెల గారు

పాటల నేస్తం సిరివెన్నెల
మిమ్మల్ని మరిచేది ఎలా
ఎన్నటికీ మరువదు తెలుగు నేల
మీ పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి ఎల్లవేళ

Wednesday, 23 April 2025

కాశ్మీరం

నెత్తురోడిన కాశ్మీరం
మరిగిపోతుంది రుధిరం
తల్లడిల్లిపోతోంది భారతం
పట్టాలి శత్రువుల భరతం

Sunday, 16 March 2025

ప్రేమా... చెప్పుమా

ప్రేమా ఓ ప్రేమా
చిట్టచివర నిలిచేది మధుర జ్ఞాపకమా
లేక మిగిల్చేది కన్నీటి రుధిరమా
ఇది శాపమా లేక వరమా
కొంచెం తెలిస్తే చెప్పుమా